పోలీసులతో ప్రభుత్వమే హత్య చేయించింది : బండి

by Sridhar Babu |
BJP leader Bandi Sanjay
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రభుత్వ పెద్దల అవినీతి, అక్రమాల చిట్టా వామనరావు దంపతుల దగ్గర ఉండడం వల్లే ప్రభుత్వం కొందరు పోలీస్ అధికారుల సహకారంతో వారిని హత్య చేయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. న్యాయవాద దంపతుల హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. వామనరావు దంపతుల హత్య రాష్ట్ర ప్రభుత్వ హత్యేనని ఆయన అన్నారు. ప్రభుత్వ అక్రమాలపై పోరాటం చేస్తుండడంతోనే ఆ దంపతుల హత్యకు కారణమని చెప్పారు. అధికార పార్టీ నాయకుల చేతిలో అన్యాయానికి గురైన పేదల పక్షాన వామనరావు పోరాడుతున్నారని గుర్తు చేశారు. ఆయనకు రక్షణ కల్పించాలన్న హైకోర్టు ఆదేశాలను సైతం ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రశ్నించే గొంతుకు రాష్ట్రంలో స్థానం‌ లేదని, వామనరావు దంపతుల హత్యతో నిరూపణ అయిందని సంజయ్ విరుచుకుపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed