- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాహనదారులకు తీపికబురు
దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రం వాహనదారులకు తీపికబురును అందించింది. మరోసారి వాహన పత్రాల గడువును పెంచి వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్ నెస్ , రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వంటి అన్ని పత్రాల వాలిడీటీని 2021 సెప్టెంబర్ వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ఇదివరకే ఫిబ్రవరి ఒకటిన ముగిసిన ఈ వాలిడిటీని కరోనా కారంణంగా 2021 జూన్ 30 వరకు కేంద్రప్రభుత్వం పొడిగించింది. అయితే మరోసారి వాహన పత్రాల గడవును కేంద్రం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
వాహనదారులు ఎలాంటి ఇబ్బందులను గురికాకుడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రిత్వశాఖ పేర్కొంది. అలానే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు దీనికి సహాకరించాలని తెలిపింది. వాహనంకు సంబంధించి ఫిట్‌నెస్, పర్మిట్లు, లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇతరత్రా డాక్యుమెంట్ల వ్యాలిడీటీ పెంచడం వలన వాహనదారులు ఈ కరోనా సంక్షోభంలో ఎలాంటి ఇబ్బందుల ఎదుర్కొకుండా సెప్టెంబర్ 30 వరకు వెహికిల్ డాక్యుమెంట్స్ చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. అలానే రవాణాదారులు వీటికోసం ఎలాంటి పెనాల్టీ కట్టాల్సిన అవసరం ఉండదని తెలిపింది.
- Tags
- Motorists