లింగాలలో విషాదం.. జ్వరంతో బాలిక మృతి

by Shyam |
girl died, fever
X

దిశ, లింగాల: వర్షాకాలం ప్రారంభం నుంచే రాష్ట్రంలో డెంగీ జ్వరం విజృంభిస్తోంది. దానితో పాటు సీజనల్ వ్యాధుల బారినపడి ఇప్పటికే అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా.. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం కోతకుంటపల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోతకుంటపల్లి గ్రామానికి చెందిన అబ్బయ్య కూతురు పల్లవి(8) గత ఐదురోజుల క్రితం అనారోగ్యం బారినపడింది. గ్రామంలో సరైన వైద్యం అందక, జ్వరం ఎంతకీ తగ్గకపోవడంతో గురువారం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి మార్గంమధ్యలో చనిపోయింది. గ్రామంలో ఉన్నటువంటి ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేనందునే తమ కూతురు చనిపోయందని కుటుంబసభ్యులు వాపోయారు.

Advertisement

Next Story