హరీశ్ రావు హామీని.. గుర్తు చేసిన మాజీ ఎమ్మెల్యే

by Shyam |
హరీశ్ రావు హామీని.. గుర్తు చేసిన మాజీ ఎమ్మెల్యే
X

దిశ, మెదక్: ఎన్నో సంవత్సరాల నుంచి రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా చేయాలని స్థానిక ప్రజలు ఎన్నో ఉద్యమాలు చేశారని మెదక్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. మంత్రి హరీష్ రావు ఆ సమయంలో రెవెన్యూ డివిజన్‌గా మారుస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు. ఇప్పటివరకూ తెలంగాణలో జిల్లాలు, నాలుగు రెవెన్యూ డివిజన్లు పెరగడం జరిగిందని శశిధర్ రెడ్డి వివరించారు. ఇప్పుడు కొత్తగా ఆందోల్ జోగిపేట్ కూడా రెవెన్యూ డివిజన్‌గా మారిందన్నారు. గతంలో మంత్రి హరీష్ రావు పరకాలను రెవెన్యూ డివిజన్‌గా చేసిన అనంతరం రామాయంపేట రెవెన్యూ డివిజన్‌గా చేస్తానని చెప్పినట్టు ఆయన గుర్తుచేశారు. మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా చేయడంలో విఫలం అయ్యారని విమర్శించారు. త్వరలోనే రామాయంపేట డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో రామాయంపేట ప్రజల పక్షాన ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపడతామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed