- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియాలో తొలిసారిగా కనిపించిన కరోనా వేరియంట్ ఏమిటంటే?
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ తొలిసారి కనిపించిన దేశం పేరుతోనే ఆ వేరియంట్‌ను పిలవవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఇది వరకే సూచించింది. ఇండియా, సింగపూర్‌లో ఇలా దేశాల పేర్లుపెట్టి వేరియంట్లను పిలవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో సోమవారం వేరియంట్లకు గ్రీకు పదాలతో పేర్లను సూచించింది. ఇండియాలో తొలిసారి కనిపించిన బీ.1.617.2ను ‘డెల్టా’గా పేర్కొంది.
బీ.1.617.1 వేరియంట్‌ను ‘కప్పా’గా వ్యవహరించాలని తెలిపింది. యూకేలో తొలిసారి వెలుగుచూసిన బీ.1.1.7ను ‘ఆల్ఫా’, దక్షిణాఫ్రికాలో రిపోర్ట్ అయిన బీ.1.351ను ‘బీటా’, బ్రెజిల్‌లో కనిపించిన పీ.1ను ‘గామా’గా నామకరణం చేసింది. ఇవి ఆందోళనకర వేరియంట్లు(కప్పా మినహా)గా డబ్ల్యూహెచ్‌వో గుర్తించింది. వీటితోపాటు ఇంటెరెస్టెడ్ వేరియంట్లకూ పేర్లుపెట్టింది. అందులో అమెరికాలో తొలిసారి కనిపించిన బీ.1.427/బీ.1.429ను ‘ఎప్సిలాన్’గా, బీ.1.526ను ‘అయోటా’గా, బ్రెజిల్‌లో కనిపించిన పీ.2ను ‘జెటా’, పలుదేశాల విరివిగా కనిపిస్తున్న బీ.1.525ను ‘ఈటా’, పిలిప్పీన్స్‌లో వెలుగులోకి వచ్చిన పీ.3ను ‘థెటా’గా పేర్కొంది.