- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొడుకుపై ప్రేమతో.. 105కి.మీ సైకిల్ తొక్కి…
దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి తన కొడుకును 105కిలోమీటర్లు సైకిల్‌పై తీసుకెళ్లి పదో తరగతి పరీక్ష రాయించాడు. థార్‌జిల్లాలో జరిగిన సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పదో తరగతిలో మొదటి ప్రయత్నంలో తప్పిన విద్యార్థుల సబ్జెక్టులను క్లియర్ చేయడానికి ప్రభుత్వం ‘రుక్ జానా నహీ’అనే పథకాన్ని ప్రవేశపెట్టి పరీక్షలు నిర్వహిస్తుంది.
ఇదే క్రమంలో బేడిపూర్ గ్రామానికి చెందిన 38ఏళ్ల శోభ్రామ్.. తనకొడుకు ఆశిష్‌ను పరీక్ష రాయించేందుకు థార్ జిల్లాలోని ఎగ్జామ్ సెంటర్‌కు సైకిల్‌పై కూర్చోబెట్టుకొని వెళ్లాడు. ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో బస్సులు, రైళ్లు సరిగా నడవట్లేదు. దీంతో అతని వద్ద బైక్ కూడా లేకపోవడంతో.. ఎలాగైనా కొడుకును పరీక్ష రాయించాలని ఫిక్సైన శోభ్రామ్.. రెండ్రోజుల ముందే బయల్దేరి థార్‌లోని ప్రభుత్వ భోజ్ బాలికల పాఠశాలకు చేరుకొని మంగళవారం పరీక్ష రాయించాడు. నాకు చదువు లేకనే కూలీని అయ్యానని, తన కొడుకు అలా కావొద్దనే ఉద్దేశ్యంతోనే ఇంతదూరం పరీక్షకు తీసుకొచ్చినట్లు శోభ్రామ్ పేర్కొన్నారు.