- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దారుణం : తన పోలికలతో లేదని కూతురిని చంపిన తండ్రి

X
దిశ, వెబ్‌డెస్క్ : అనంతపురం జిల్లా కల్యాణ దుర్గంలో దారుణం చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తండ్రి ముక్కుపచ్చలారిని పసి బిడ్డ.. రెండు నెలల పాపను దారుణంగా హత్య చేశాడు. బిడ్డ తన పోలికలతో లేదంటూ భార్యతో గొడవపడ్డ మల్లికార్జున.. గురువారం రాత్రి బిడ్డను తీసుకొని పారిపోయాడు. దీంతో బిడ్డను చంపేస్తాడనే భయంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాప ఆచూకి కోసం రాత్రి నుంచి గాలించిన పోలీసులకు చివరకు ఓ సంచిలో నిర్జీవంగా పాప కనిపించింది. పాప నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు తండ్రి. చిన్నారి చనిపోయిందని తెలిసిన ఆ తల్లి రోదనలు మిన్నంటాయి. పాప మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story