- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా ఎఫెక్ట్.. నిండిపోయిన శ్మశాన వాటికలు, ఆసుపత్రులు
కరోనా వైరస్ బ్రెజిల్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతూ విలయతాండవం చేస్తోంది. రియోడిజెనీరో నగరంతో పాటు మరో నాలుగు ప్రధాన నగరాల్లో కరోనా పేషెంట్లతో అన్ని ఆసుపత్రలులు నిండిపోయాయి. దీంతో కొత్త కేసులు చేర్చుకోవడానికి బెడ్స్ లేవని చేతులెత్తేసిన ఆసుపత్రి యాజమాన్యాలు. మృతుల సంఖ్య సైతం విపరీతంగా పెరగడంతో శ్మశాన వాటికలు కూడా నిండిపోయాయని సిబ్బంది ఆందోళన చేస్తున్నారు. రోజూ వందల సంఖ్యలో మృతదేహాలను ఖననం చేస్తున్నట్టు వెల్లడించారు. దీంతో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై అక్కడి ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి సామాజిక దూరం పాటించాల్సిన అవసరం లేదని, అధిక ప్రమాదం ఉన్నవారిని మాత్రమే ఐసోలేట్ చేయాలని ఆయన సూచించారు. ఈ క్రమంలో అక్కడి సామాజిక దూరం పాటించకుండా వ్యవహరించడంతో కరోనా వేగంగా పెరిగి దేశాన్ని ముచ్చెమటలు పట్టిస్తోంది.
Tags: fastest, growing, coronavirus, positive cases, deaths, hospitals, Brazil president