- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరెంటు కట్.. కేసీఆర్ సారొస్తున్నాడనేనా?
దిశ ప్రతినిధి, మెదక్: రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నాడంటే ఆ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎప్పుడు ఎక్కడ వున్నాడు.. ఏమేమి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నాడనే విషయాలు తెలియడానికి విద్యుత్ సమస్య తలెత్తకుండా చూస్తారు. కానీ.. సీఎం కేసీఆర్ సిద్దిపేట పర్యటన అందుకు విరుద్ధంగా సాగుతోంది. సిద్దిపేటలో టీఆర్ఎస్ నేతలు.. అధికారులు, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి వెళ్లే మార్గంలో విద్యుత్ తీగల ముప్పుందని సాకు చెబుతూ కరెంటు కట్ చేశారు. దీనిపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వస్తే కరెంట్ పోకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారు.. ఉన్న కరెంట్ తీసేయడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతా భయం ఉన్నదనుకున్నడు ముఖ్యమంత్రి పర్యటన రద్దు చేసుకోవాల్సి ఉండే అని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు.