అంబులెన్స్ మీద రావణుడు.. కరోనా వచ్చిందంటా!

by Shamantha N |
అంబులెన్స్ మీద రావణుడు.. కరోనా వచ్చిందంటా!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా దెబ్బకు 2020లో పరిస్థితులే మారిపోయాయి. మానవ జీవన విధానం ఒక్కసారిగా తలకిందులై ముఖాలకు మాస్కులు, చేతులకు శానిటైజర్లు వచ్చాయి. ఇంకేముంది ఈ విషయం సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంది. మనుషుల మీదనే కాకుండా దీని ప్రభావం పండుగల పై కూడా పడింది. తాజాగా హర్యానాలోని సోనిపట్ జిల్లాలో దసరా సందర్భంగా రావణ దహనం కోసం రావణుడిని అంబులెన్స్ మీద కట్టేసి తీసుకెళ్లారు. ఈ దృశ్యాన్ని చూసిన ఫారెస్ట్ అధికారి సుసాంత ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. రావణుడికి కరోనా వచ్చింది అందుకే అంబులెన్స్ మీద ఎక్కించి తీసుకెళ్లారు.. అంటూ పోస్ట్ పెట్టారు. ఈ దృశ్యాల్ని చూసిన నెటిజన్లు ఇక నిజమేనేమో అంటూ ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వార్త ఒక్కసారిగా వైరల్‌ అయింది.

Advertisement

Next Story