- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈటల టార్గెట్ 270కిమీ.. ‘ఆత్మగౌరవమే నినాదం’
దిశ, వెబ్‌డెస్క్ : హుజురాబాద్ ఉప ఎన్నికపై రాజకీయపార్టీలు ఫోకస్ పెట్టాయి. నియోజకవర్గం ప్రజలతో మమేకం కావడానికి, బలం పెంచుకోవడానికి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే హుజురాబాద్ ప్రజలతో మమేకం అయ్యేందుకు ఈటల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేయడానికి ఈటల సిద్ధమయ్యాడు.
కమలాపూర్ బత్తినివానిపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీఆర్ఎస్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర సోమవారం ఉదయం 9గంటల 30నిమిషాలకు ఆరంభం కానుంది. 23 రోజుల పాటు జరగనున్న పాదయాత్రలో 107 గ్రామపంచాయితీల పరిధిలోని 127 గ్రామాల్లో 270 కిలోమీటర్ల దూరం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ముందుగా పాదయాత్రను కమలాపూర్ మండలం బత్తినివాని పల్లి నుంచి మొదలు పెట్టనున్నారు. బత్తినివానిపల్లి లోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం శనిగరం, మాదన్నపేట, గునిపర్తి, శ్రీరాముల పేట, అంబల ప్రాంతాలలో పాదయాత్ర నిర్వహించాలని ప్లాన్ చేశారు. మంగళవారం రాత్రి ఈటల అంబాలలో ఉండనున్నారు.