వైద్యుడికి పూలతో ఘన సన్మానం

by Shyam |
వైద్యుడికి పూలతో ఘన సన్మానం
X

దిశ, వరంగల్: కరోనా ఆపత్కాలంలో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో రోగులకు సేవలందించి తిరిగి జిల్లాకు వచ్చిన వైద్యుడికి స్థానిక వైద్యులు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. జనగామ జిల్లా ఆస్పత్రికి చెందిన డాక్టర్ మనోహర్ రెడ్డి నలభై‌ రోజుల పాటు కొవిడ్ వారియర్‌గా గాంధీ ఆస్పత్రిలో విధులు
నిర్వహించారు. ఆదివారం తిరిగి జిల్లా ఆస్పత్రికి రాగా వైద్య సిబ్బంది పూల వర్షం కురిపిస్తూ కరతాళ ధ్వనుల మధ్య స్వాగతించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడుతూ శాలువలతో సన్మానించారు.

Tags: doctors, great welcome, medical staff, warangal,hyd, gandhi hospital

Advertisement

Next Story

Most Viewed