- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొలకరి పలకరించగానే వజ్రాల వేట షురూ
దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కూలీనాలీ లేకుండా పోయింది. ప్రభుత్వం ఇచ్చిన రేషన్ సరకులు, చేతిలో ఉన్న కాస్త నగదుతోనే జనమంతా జీవితాలను నెట్టుకొస్తున్నారు. కరోనా కారణంగా రోహినీ కార్తె ఎండలు మండిపోతుండడంతో ఇంటిపట్టున ఉన్న ప్రజలు కాస్త సేదదీరారు. ఇంతలోనే ఆంధ్రప్రదేశ్‌ను తొలకరి జల్లులు పలకరించాయి. దీంతో కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో కోలాహలం మొదలైంది.
కర్నూలు జిల్లాలో నిన్నటి నుంచి చిరుజల్లులు కురుస్తుండడంతో తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి తదితర మండలాల్లో వజ్రాల వేట ఆరంభమైంది. వర్షం తాకిడికి భూమి లోపలి నుంచి బయటకు వచ్చే వజ్రాలు, రంగురాళ్ల కోసం ప్రజలు పెద్దఎత్తున వేట ప్రారంభించారు. గుంతకల్, ద్రోణాచలం ప్రాంతాల్లో మకాం వేసి, అక్కడి నుంచి వజ్రాలు దొరుకుతాయన్న భూముల్లోకి వెళ్లి, రోజంతా వెతుకున్న వారి సంఖ్య గత రెండు రోజుల్లో భారీగా పెరిగిపోయింది. ఒక్కటి దొరికినా కరోనా నష్టం భర్తీ అవుతుందని చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పనులన్నీ మానుకుని మరీ వేటలో భాగమవుతున్నారు. అంగుళం అంగుళం జల్లెడపడుతున్నారు.
కాగా, ఈ సీజన్‌లో ఇప్పటికే ఈ పరిసరాల్లో ఆరు వజ్రాలు దొరికాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐదు రోజుల క్రితం కోటి రూపాయల వజ్రం విక్రయంలో రైతును మోసం చేసిన వార్త వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ కోటి రూపాయల వజ్రం వార్త తరువాత అలా రైతులెవరైనా వజ్రాలు విక్రయిస్తే కొనుగోలు చేసేందుకు ముంబయి, కోయంబత్తూరు ప్రాంతాల నుంచి మధ్యవర్తులు సైతం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకోవైపు ఇక్కడి వజ్రాల వేటకు దూర ప్రాంతాల నుంచి కూడా పలువురు వచ్చేవారు. అయితే కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఇతర ప్రాంతాల వారిని రాష్ట్రంలోకి అనుమతించకపోవడంతో స్థానికులే వజ్రాల కోసం భారీ ఎత్తున గాలింపు చేపట్టారు.