చలసాని శ్రీనివాస్ కూతురు అనుమానాస్పద మృతి

by srinivas |
Chalasani Srinivasa Rao daughter died
X

దిశ, శేరిలింగంపల్లి: ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు కూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాసరావు కుమార్తె శిరీష్మ (27)కు హైదరాబాద్‌లోని ఓయూ కాలనీ నివసించే గ్రానైట్ వ్యాపారి సిద్ధార్థ్‌తో 2016లో పెండ్లి జరిగింది. సిద్ధార్థ్ గ్రానైట్ వ్యాపార వ్యవహారాలు చూసుకుంటుండగా, శిరీష్మ ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం వారు గచ్చిబౌలిలోని నివాసముంటున్నారు. పెండ్లయి నాలుడేండ్లయినా వీరికి పిల్లలు లేకపోవడంతో కొన్నాళ్లుగా ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. ఫలితం లేకపోవడంతో ఆమె మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రి ఇంటికి వచ్చిన సిద్దార్థ్ ఉరివేసుకున్న ఆమెను చూసి ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చలసాని శ్రీనివాసరావు ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story