- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యాదాద్రిలో ఏమైంది.. ఎందుకట్ల అందరూ విమర్శిస్తున్రు..?
యాదాద్రి ఆలయాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దీని నిర్మాణం కోసం రూ.2 వేల కోట్లు కేటాయించింది. కానీ, నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించం లేదు. గర్భాలయంలోకి నీరు వచ్చి చేరుతోంది. ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణంలో ఉండగా స్లాబ్ కూలడంతో నలుగురు కూలీలు తీవ్ర గాయాలపాలయ్యారు. బ్రహ్మోత్సవ మండపానికి సైతం పగుళ్లు ఏర్పడ్డాయి. వీటితో పాటు మరిన్ని లోపాలు కనిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు నాణ్యత విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
దిశ ప్రతినిధి, నల్లగొండ : యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహాస్వామి ఆలయాన్ని ‘యాదాద్రి’ పేరుతో టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందుకోసం ఆలయ నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఆలయ అభివృద్ధి కోసం 2014లో వైటీడీఏ(యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ)ను ఏర్పాటు చేశారు. యాదాద్రి టెంపుల్ అభివృద్ధి కోసం రూ.2వేల కోట్లను కేటాయించారు. ధార్మిక అవసరాల కోసం యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లోని ఆరు గ్రామాల పరిధిలో దాదాపు 80 సర్వే నెంబర్లలోని 2028.37 ఎకరాల భూమిని సేకరించారు అధికారులు. ఇంత వరకు భాగానే ఉన్నా.. ఆలయ నిర్మాణ పనుల్లో జాప్యం నెలకొంటుంది. దీనికి తోడు నిర్మాణ పనుల్లో వరుసగా నాణ్యత ప్రమాణాలలో డొల్లతనం బయటపడుతోంది. గతంలో యాదాద్రి నిర్మాణంలో భాగంగా చేపట్టిన ఆలయ ఘాట్ రోడ్డు కూలిపోయింది. ఇటీవల గర్భగుడిలోకి వర్షపు నీరు చేరడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బ్రహ్మోత్సవ మండపానికి పగుళ్లు..
ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ప్రధానాలయం ఎదుట నిర్మించిన బ్రహ్మోత్సవ మండపం కింద ఒకవైపు పగుళ్లు వచ్చి ఫ్లోరింగ్ బండలు కిందకు కుంగాయి. భద్రాచలంలోని బ్రహ్మోత్సవ మండపం మాదిరిగానే యాదాద్రిలోనూ ఉండాలనే లక్ష్యంతో సుమారు రూ.2.75 కోట్లతో కృష్ణ శిలలతో అష్టభుజి ఆకారంలో ఈ మండపాన్ని తీర్చిదిద్దారు. స్తంభాలను ఆకర్షణీయంగా చెక్కించారు. కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా యాదాద్రిలోని మండపానికి ఉత్తరం వైపు పగుళ్లు వచ్చాయి. ఈ మండపం చుట్టూ వర్షపునీరు పోవడానికి భూగర్భ డ్రైనేజీ వేశామని, అందువల్ల ఫ్లోరింగ్‌కు పగుళ్లు వచ్చాయని వైటీడీఏ అధికారులు అంటున్నారు.
కూలిన స్లాబ్..
ఆలయ పనుల్లో గతం నుంచే నాణ్యత లోపాలు బయటపడుతున్నాయి. ఆలయానికి పక్కనే ఉన్న మరో గుట్టపై దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో వీవీఐపీ భక్తుల కోసం 20 వరకు ప్రెసిడెన్షియల్ సూట్ విల్లాల నిర్మాణం చేస్తున్నారు. ఆ పనుల్లో భాగంగానే వేస్తున్న స్లాబ్ కూలడంతో నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో యాదాద్రి నిర్మాణ పనులపై విమర్శలు వెల్లువెత్తాయి.
గర్భాలయంలోకి వర్షపు నీరు
ఇటీవల కురిసిన వర్షాలకు ప్రధానాలయంలోని గర్భాలయం, ముఖ మండపంలోకి వర్షపు నీరు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సాంకేతిక కమిటీ సభ్యుడు కొండల్‌రావు, ఈవో గీతారెడ్డి, ఆలయ ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి, స్థపతి వేలు, వైటీడీఏ అధికారులు ప్రధానాలయంలోని ముఖమండపాన్ని పరిశీలించారు. వర్షపు నీరు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సమాలోచనలు జరిపారు. యాదాద్రి ప్రధానాలయం, తిరుమాడ వీధుల పనులనూ పరిశీలించారు. ఆలయం పైకప్పుభాగంలో రెయిన్ ఫ్రూప్‌ను సాంకేతిక నిపుణులు పరిశీలించారు. వర్షం నీరు రాకుండా, ఏవిధమైన ఏర్పాట్లు చేయాలనే అంశంపై అధికారులు చర్చించారు. ఇదిలావుంటే.. అద్దాల మండపం పైకప్పు ఇటీవలే వేశారు. రాళ్ల మధ్య వేసిన జిగురు పదార్థం గట్టిపడటానికి రెండు నెలల సమయం పడుతుంది. ఈలోపే వర్షం కురవడంతో పైకప్పు ఉరిసి నీరు మండపంలోకి చేరిందని అధికారులు చెబుతున్నారు. కానీ భక్తులు, స్థానికులు మాత్రం ఆలయ నిర్మాణ పనుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
యాగశాలపైనా అసంతృప్తి..
శివాలయం ఆవరణలో నిర్మించిన యాగశాల ఆకృతిని మార్చారు. ఆలయ పునర్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు ఇటీవలే సీఎంవో భూపాల్‌రెడ్డి సందర్శించారు. శివాలయం పనుల పురోగతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత నిర్మాణాలను వేగవంతం చేశారు. 16 కాళ్లతో నిర్మించిన యాగశాల ఇరుకుగా ఉందని.. దాన్ని మార్పు చేయాలని సీఎంవో ఆదేశించగా వైటీడీఏ అధికారులు.. ఆకృతిని మార్చారు. యాగం చేసే సమయంలో వచ్చే పొగ పైకి వెళ్లడానికి పైకప్పునకు మార్పులు చేశారు.