- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్యారడైస్, డీమార్ట్ లకు భారీ షాక్.. ఇకనుంచి క్యారీ బ్యాగ్‌లు ఫ్రీ
దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్, బేగంపేట ప్యారడైస్ రెస్టారెంట్లు, హైదర్ గూడ డీమార్ట్ లు క్యారీ బ్యాగులకోసం అదనంగా డబ్బులు వసూలు చేయటాన్ని హైదరాబాద్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తప్పుపట్టింది. ఒక్కొక్కరికీ రూ.50వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఫిర్యాదుదారులు విజయ్ గోపాల్ ట్విట్టర్లో వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే.. విజయ్ గోపాల్ అనే వ్యక్తి 2019 ఏప్రిల్ లో సికింద్రాబాద్ ప్యారడైజ్ రెస్టారెంట్ నుంచి ఆహారాన్ని కొనుగోలు చేశారు. రెండు నెలల తరువాత, అతను మళ్లీ ప్యారడైజ్ రెస్టారెంట్ బేగంపేట నుండి ఆహారాన్ని కొనుగోలు చేశారు. అంతేకాకుండా, ఆయన 2019 జూన్ లో హైదర్‌గూడలోని డీ-మార్ట్ నుండి కిరాణా సామాగ్రిని కొనుగోలు చేశారు. ఈ సందర్భంలో ప్యారడైజ్ రెస్టారెంట్ క్యారీ బ్యాగ్ కోసం రూ.4.76 ఛార్జ్ చేయగా, డీ మార్ట్ రూ. 3.5 వసూలు చేసింది. దీనిపై ఆయన వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ను ఆశ్రయించారు. దీంతో క్యారీ బ్యాగ్‌ల ఛార్జీలను నిలిపివేయాలని కమిషన్ రెస్టారెంట్, రిటైల్ అవుట్‌లెట్‌ను ఆదేశించింది. “క్యారీ బ్యాగ్‌ల కోసం ఛార్జ్ చేయడం ఆపివేసి, వినియోగదారులందరికీ ఉచితంగా అందించండి” అని కమిషన్ తెలిపింది.
The court has ordered the restaurants to give bags for free, as they need to be if they are not registered.
I hope at least now @CommissionrGHMC @TSMAUDOnline wake up and do their job and stop this consumer harassment in Telangana & ensure bags are provided only if registered
— Vijay Gopal (@VijayGopal_) August 27, 2021