- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘టెన్త్ పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించాలి’
దిశ, మేడ్చల్: కరోనా మూలంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు.. జూన్ 8వ తేదీ నుంచి నిర్వహిస్తున్న రాష్ర్ట విద్యాశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని మేడ్చల్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా హై పవర్ కమిటీ సమావేశమై అన్ని శాఖల ఉన్నతాధికారులకు టెన్త్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. విద్యార్థులందరూ సామాజిక దూరం పాటించేలా పరీక్షల నిర్వహణ చేపట్టాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మాస్కులు, శానిటైజర్లు, క్రీమి సంహాకర మందులు, గ్లౌజులు అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు విద్యార్థులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని సూచించారు. జిల్లాలో 377 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు, 44,839 విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్టు కలెక్టర్ తెలిపారు.