50 శాతం సాధారణ ప్రసవాలు.. అక్కడే జరగాలి

by Aamani |
50 శాతం సాధారణ ప్రసవాలు.. అక్కడే జరగాలి
X

దిశ, ఆదిలాబాద్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో 50శాతం సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో వైద్యశాఖ ఆధ్వర్యంలో సాధారణ ప్రసవాలపై ప్రభుత్వ, పైవేటు ఆస్పత్రుల వైద్యులతో విడివిడిగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో 50శాతం సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి ఆసుపత్రిలో ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాలన్నారు. గర్భిణులకు, కుటుంబ సభ్యులకు ఆపరేషన్ల వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. జులై నెల నుండి ప్రతి ఆసుపత్రిలో ఖచ్చితంగా 25శాతం సాధారణ ప్రసవాలు జరగాలన్నారు. ప్రతి రోజు ప్రసవాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed