- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి కేటీఆర్ ట్వీట్.. చిన్నారిని అప్యాయంగా దగ్గరకు తీసుకున్న కలెక్టర్ ముషారఫ్ అలీ
దిశ, ముధోల్ : నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని ‘ఎడ్ బీడ్’ అనే గ్రామంలో మంగళవారం ఉదయం సుంకా భూమవ్వ (33) అనే మహిళా అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆమె భర్త కూడా మరణించగా వీరి ఒక్కగానొక్క కూతురు ‘రోష్ని’ అనాథ అయ్యింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఆయన చిన్నారి బాగోగులు ప్రభుత్వమే చూస్తుందని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. సంబంధిత జిల్లా అధికార యంత్రాంగానికి ఈ విషయాన్ని తన సిబ్బంది ద్వారా తెలిసేలా చేశారు. అంతేకాకుండా గ్రామంలోని కొందరు పాప బాగోగుల కోసం ఆర్ధిక సాయం కోరగా దాదాపు 1,70,000 రూపాయలు సమకూరాయి.
మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ బుధవారం ‘ఎడ్ బిడ్’ గ్రామాన్ని సందర్శించారు. బాలికను అప్యాయంగా దగ్గరకు తీసుకుని ఇకనుంచి చిన్నారి బాగోగులను ప్రభుత్వమే చూస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ బాధ్యులు సీడీపీఓ అండ్ డీసీపీఓ దేవి మురళి, బాలల సంక్షేమ సమితి సభ్యులు చందు అనిల్, స్వదేశ్ పరికిపండ్ల, చైల్డ్ లైన్ బాధ్యులు కలెక్టర్ ఆదేశాల మేరకు బాలికను బాల సదన్ ఆదిలాబాద్ నందు చేర్పించడానికి తగిన చర్యలు చేపట్టారు. ముందుగా బాలికకు వైద్యం అందించిన అనంతరం శిశు గృహంనకు తరలించారు.