కష్ట కాలంలో అండగా.. సీఎం సహాయ నిధి

by Shyam |
కష్ట కాలంలో అండగా.. సీఎం సహాయ నిధి
X

దిశ, కల్వకుర్తి: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరంలాంటిదని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరి అప్పులు చేసి ఆస్పత్రులకు బిల్లుల కట్టిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఆసరాగా నిలుస్తుందని కసిరెడ్డి నారాయణ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కల్వకుర్తి మండలం జిల్లేల గ్రామ పంచాయతీకి చెందిన సి. హెచ్ సత్యనారాయణ గౌడ్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రూ.2లక్షల చెక్కును, ఎమ్మెల్సీ హైదరాబాద్ లోని తమ నివాసంలో బాధితునికి అందించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జిల్లేల రాములు, మండల నాయకులు కొండల్, దామోదర గౌడ్,బాల్ జంగయ్య, రవి గౌడ్, వెంకటేష్, చంధ్రకాంత్, శ్రీశైలం, విష్ణు,సురేష్, సుల్తాన్,తదితరుల మద్య అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed