- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలి.. ఎంఎస్ఎఫ్
దిశ, అచ్చంపేట : కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి అమలు చేయాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా ఇన్చార్జి సౌట కాశిo డిమాండ్ చేశారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన ఎంఎస్ఎఫ్ నాయకులు ఢిల్లీలో నిర్వహించిన జాతీయ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సౌట కాశిo మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించకుండా కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్గీకరణతో ఎస్సీ సామాజిక వర్గాలకు సమన్యాయం జరుగుతుందని, కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశ పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ మహేష్ మాదిగ, నాయకులు కుమార్, శంకర్, రామ్ ప్రసాద్, వెంకటేష్, ధనుష్, ఈశ్వర్, శ్రీకాంత్, పవన్, శివ, శ్రీను పాల్గొన్నారు.