- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డోర్ డెలివరీ ‘రేషన్’పై రగడ
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ప్రవేశపెట్టాలని భావించిన డోర్ డెలివరీ రేషన్ స్కీంపై కేంద్రం మోకాలడ్డిందని సీఎంవో ఆరోపించింది. మరో రెండు రోజుల్లో అమలు చేయాలని తలపెట్టిన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కావాలనే అడ్డుకుంటున్నదని పేర్కొంది. కేంద్రం గతంలో లేవనెత్తిన అంశాలన్నింటినీ సవరించామని, అయినప్పటికీ అదే తీరులో వ్యవహరించిందని ఓ ప్రకటనలో తెలిపింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద రేషన్ సరుకుల పంపిణీ జరుగుతుందని, ఇది కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండటంతో డోర్ డెలివరీ పథకానికి సీఎం పేరు పెట్టరాదని కేంద్రం అభ్యంతరం తెలిపింది. కేంద్రం అభ్యంతరాలను పరిష్కరిస్తూ సీఎం అక్షరాలను పథకం నుంచి కేజ్రీవాల్ ప్రభుత్వం తొలిగించింది. తాజాగా, ఈ డెలివరీ పథకం ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ వెనక్కి పంపించారు.
దీనిపై కేజ్రీవాల్ ప్రభుత్వం మండిపడింది. అయితే, కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించలేదని, కేవలం పున:సమీక్షించాలనే తిరిగి పంపిందని లెఫ్టినెంట్ గవర్నర్ సన్నిహితవర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రతిపాదనను వెనక్కి పంపడానికి రెండు కారణాలను ఎల్జీ లేవనెత్తారని తెలిసింది. అవి, 1. రేషన్ సరుకుల పంపిణీ పద్ధతిలో మార్పు చేస్తున్నందన జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి. 2. ప్రభుత్వ పథకాన్ని సవాల్ చేస్తూ సర్కారీ రేషన్ డీలర్ల సంఘం ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిందని, ఆగస్టు 20న విచారణ జరుపుతున్నదని పేర్కొన్నారు. ఈ రెండు కారణాలను పేర్కొంటూ ఫైల్‌ను వెనక్కి పంపినట్టు సమాచారం. కాగా, ఢిల్లీ ఆహార మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ మాట్లాడుతూ, ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారం ఈ పథకానికీ ఆమోదమూ అవసరం లేదని, రిట్ పిటిషన్లను కోర్టు విచారిస్తున్నప్పటికీ స్టే ఇవ్వలేదని గుర్తుచేశారు.