R&AW, Intelligence Bureau Tenure : ఐబీ, రా చీఫ్‌ల పదవీకాలం పొడిగింపు

by Shamantha N |   ( Updated:2021-05-27 09:01:29.0  )
Intelligence Bureau
X

న్యూఢిల్లీ: దేశంలోని టాప్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల బాస్‌ల పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది కాలం పొడిగించింది. ప్రధాని నరేంద్రమోడీ సారథ్యంలోని అపాయింట్‌మెంట్ కమిటీ క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) చీఫ్ సామంత్ కుమార్ గోయల్, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెడ్ అరవింద్ కుమార్‌లను అదే పదవిలో మరో ఏడాదిపాటు కొనసాగించనున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. వీరిరువురి పదవీకాలం జూన్ 30తో ముగియనుంది. 1984 బ్యాచ్, పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ గోయల్ రా సెక్రెటరీగా వచ్చే ఏడాది జూన్ 30 వరకు కొనసాగుతారు.

అసోం, మేఘాలయ క్యాడర్ ఐపీఎస్ అధికారి అరవింద్ కుమార్ జూన్ 30 తర్వాత నుంచి ఐబీ హెడ్‌గా మరో ఏడాది సేవలందిస్తారు. సీబీఐ బాస్ ఎంపికలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ ప్రస్తావించిన ఆరు నెలల నిబంధన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దర్యాప్తు సంస్థ చీఫ్‌గా నియమించే అధికారి పదవీకాలం ఆరు నెలలకు తక్కువగా ఉండకూడదన్న సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ను సీజేఐ జస్టిస్ రమణ పేర్కొనడంతో కేంద్రం చాయిస్ లిస్టు నుంచి ఇద్దరు కీలక అధికారుల పేర్లు ఔట్ అయ్యాయి. తర్వాత సీబీఐ చీఫ్‌గా సుబోద్ కుమార్ జైస్వాల్‌ను ప్యానెల్ నియమించింది.

కామర్స్ మినిస్ట్రీ సెక్రెటరీగా కశ్మీర్ ప్రధాన కార్యదర్శి బదిలీ

జమ్ము కశ్మీర్ రాష్ట్ర హోదా నుంచి కేంద్ర పాలిత ప్రాంతంగా మారే ప్రక్రియ కాలంలో జమ్ము కశ్మీర్ ప్రధాన కార్యదర్శిగా 2018లో నియమితులైన సుబ్రమణ్యం కామర్స్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బదిలీ కాబోతున్నారు. ఛత్తీస్‌గఢ్ క్యాడర్ అధికారి సుబ్రమణ్యం జూన్ 30న కామర్స్ సెక్రెటరీగా ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. సామంత్ కుమార్ గోయల్, అరవింద్ కుమార్, సుబ్రమణ్యం ముగ్గురూ జమ్ము కశ్మీర్ సంబంధ రక్షణ విషయాల్లో కీలకంగా వ్యవహరించారు.

Advertisement

Next Story

Most Viewed