- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అంతర్జాతీయ విమాన సేవలపై నిషేధం పొడిగింపు..

X
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన సేవలపై నిషేధాన్ని వచ్చే నెలాఖరు దాకా కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. జూన్ 30 దాకా ఈ సేవలపై నిషేధం కొనసాగుతుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శుక్రవారం ప్రకటించింది. అన్ని అంతర్జాతీయ కార్గో విమానాలకు మినహాయింపు ఉంటుందని, అలాగే, ఏవియేషన్ రెగ్యులేటరీ అనుమతించిన విమానాలకూ ఆంక్షలు వర్తించవని వివరించింది. ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకున్న దేశాలతోనూ సేవలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది మార్చిలో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌పై కేంద్ర ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఈ నిషేధాన్ని పొడిగిస్తూ వస్తున్నది. ఈ నెల 31న ఆంక్షల కాలం ముగుస్తున్నందున తాజాగా మరోసారి పొడిగింపు ప్రకటన విడుదల చేసింది.
Next Story