లాక్‌డౌన్‌కు విరుద్ధంగా సమావేశం.. సర్పంచ్‌పై కేసు

by Shyam |

మేడ్చల్: లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా సమావేశం ఏర్పాటు చేసిన సర్పంచ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. దేశంలో కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. అయితే ఈ లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సోదరుడు, ఏదులాబాద్ సర్పంచ్ కాలేరు సురేశ్ ఏకంగా గ్రామంలో ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సమావేశంలో పాల్గొన్న సభ్యులపై కూడా కేసు నమోదు చేసినట్టు ఘట్కేసర్ పోలీసులు తెలిపారు.

Tags: police case, Sarpanch, meeting, lockdown, Ghatkesar, medchal, mla

Advertisement
Next Story

Most Viewed