- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అరటిపండుపై అద్భుతమైన ఆర్ట్
దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ వల్ల కలిసొచ్చిన సమయంలో ఎంతోమంది తమ ప్రతిభను మెరుగుపరుచుకున్నారు. అలానే లండన్‌కు చెందిన సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్ అన్నా చోజ్‌నికా కూడా ‘బనానా పీల్ ఆర్ట్ వర్క్స్’ కోసం లాక్‌డౌన్ కాలాన్ని సద్వినియోగం చేసుకుంది. నిజానికి బనానాపై ఆమె వేసిన ఆర్ట్ చూస్తే నిజంగా ఎవరైనా ముగ్ధులైపోవాల్సిందే. అంతలా ఆకట్టుకుంటున్న ఆ ఆర్ట్ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం..
డూడులింగ్, డ్రాయింగ్ వేయడానికి సాధారణంగా పేపర్, కాన్వాస్ ఉపయోగిస్తారు. కానీ చోజ్ మాత్రం అందుకోసం అరటిపండ్లను వినియోగించుకుంటోంది. బనానా ఆర్ట్‌లో భాగంగా థిన్ ఆబ్జెక్ట్ ఉపయోగించి వాటికి కార్వింగ్ (గాయాలు) చేస్తుంది. కార్వింగ్ చేసిన అరటిపండు గంటలు గడిచేకొద్దీ ముదురు రంగులోకి మారి, దానిపై చోజ్ వేసిన ఆర్ట్ వర్క్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఆర్ట్ వేయాలంటే, ముఖ్యంగా లైట్, షేడ్‌ల మీద పూర్తి అవగాహన ఉండాలి. కాగా ఆమె అరటిపండుపై వేసిన ఆర్ట్‌కు ఫిదా అయిన బీబీసీ చానల్.. ఆమె ఆర్ట్ వర్క్‌పై ప్రత్యేకంగా ఓ వీడియో కూడా రూపొందించింది. ‘కొండల మధ్య నుంచి ఉదయిస్తున్న సూర్యుడు, ఓ అందమైన అమ్మాయి చిరునవ్వు, కొమ్మపై కూర్చుని తదేకంగా చూస్తున్న గుడ్లగూబ, గంభీరంగా గర్జిస్తున్న సింహం..’ ఇలాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను అరటిపండుపై చోజ్ వేసింది. కాగా ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్న ఈ ఫొటోలు ప్రతి ఒక్కరినీ ఫిదా చేస్తుండటం విశేషం.
https://www.instagram.com/banana_bruiser/?utm_source=ig_embed