- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పారాణి ఆరకముందే ప్రాణం తీసుకున్న నవ వధువు
దిశ,మునుగోడు: కాళ్ల పారాణి ఆరకముందే ఉరివేసుకొని నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన నారాయణపురం మండల పరిధిలోని మర్రిబావి తండాలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మర్రిబావి తండాకు చెందిన సభావత్ అనూష(21) వివాహం నాంపల్లి మండల పరిధిలోని బండకింది తండాకు చెందిన మధు అనే వ్యక్తితో బుధవారం జరిగింది. గురువారం వరుడు ఇంటివద్ద విందు అనంతరం రాత్రి వదువు గ్రామం మర్రిబావి తండాకు వచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున వదువు ఇంట్లో నిద్రిస్తుండగా వరుడు ఇంటి ఆరుబయట మంచంపై సేద తీరుతున్నాడు. కాసేపటికి వరుడు మధు ఇంట్లోకి వెళ్లగా అప్పటికే వధువు అనూష ఇంటి పైకప్పు సీలింగ్‌కు చీరతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
దీంతో ఆమెను విగతజీవిగా చూసిన వరుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. పెళ్లి జరిగి రెండ్రోజులు కూడా గడవకముందే వధువు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. తమ కూతురు వివాహం చేశామని తల్లిదండ్రులు సంతృప్తి చెందేలోపే అందరినీ కన్నీరుమున్నీరుకు గురిచేసింది. విషయం తెలుసుకున్న నారాయణపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభిస్తున్నట్టు ఎస్సై చందా సుధాకర్ రావు తెలిపారు.