- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్ణాటకలో నల్ల చిరుత హల్ చల్
దిశ, వెబ్ డెస్క్: నల్లచిరుతలు చాలా అరుదుగా ఉంటాయి. కర్ణాటకలోని అడవుల్లో ఓ నల్లచిరుత సంచరిస్తోందన్న వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ షాజ్ జంగ్ ఈ చిరుతకు సంబంధించిన ఫోటోలను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కబినీ అటవీ ప్రాంతంలో ఈ చిరుతను తాను చూసినట్టు ఆయన తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఈ ఫోటోలు నెటిజన్లను తెగ ఆకర్షిస్తున్నాయి. దాదాపు 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకున్నాయి.
ఇటీవల ఒక నల్ల చిరుతపులి (బ్లాక్ పాంథర్) దక్షిణ గోవాలోని నేత్రావళి అభయారణ్యంలో తిరుగుతున్నట్టుగా ఓ ఫోటో వైరల్ అయింది. అయితే.. ఈ ఫోటోలు చూసి జంగిల్ బుక్‌లో మాదిరిగా భారత్‌లో నిజంగా బగీరా కనిపించిందని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. మరొకరైతే జీవితంలో ఒక్కసారైనా ఇలాంటివి చూడాలని, ప్రకృతిని ఆస్వాదించాలని అభిప్రాయపడ్డాడు. జంగిల్ బుక్ కామిక్‌లోని బగీరా ఇదేనంటూ నెటిజన్లు చమత్కరిస్తున్నారు.