బీజేపీలో ముసలం.. అందరి చూపు వారి వైపే..

by Shyam |
BJP
X

దిశ, వేములవాడ : వేములవాడ పట్టణంలో కమలం పార్టీలో కలహం మొదలైంది. పార్టీ నేతలు రెండుగా వర్గాలుగా వీడిపోయి కార్యక్రమాలను చేడపతున్నారు. తిప్పాపూర్ గోశాలలో చనిపోయిన కోడెల విషయంలో టెంపుల్ ఈవో కృష్ణ ప్రసాద్‌కు బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రం మహేష్ ఫిర్యాదు చేయడంపై పార్టీలో ముసలం మొదలైంది.

ఎర్రం మహేష్ ఫిర్యాదు చేసిన గంటలోపే టౌన్ ప్రెసిడెంట్ సంతోష్ బాబు బీజేపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రెస్ నోట్ విడుదల చేయడంతో, పార్టీలో దాగిన అంతర్గత పోరు బయట పడింది.
15 రోజుల క్రితం వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు స్థానికంగా ఉండడం లేదంటూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తలపెట్టింది.

తెలంగాణ చౌక దీక్ష వద్ద ఓ వర్గం నిరసన తెలుపగా, మరో వర్గం అంబేద్కర్‌కు వినతి పత్రం ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ప్రతినిధ్యం వహిస్తున్న తన పట్టణంలోనే కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Next Story