- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అంతా యథాతథం.. అక్కడ కనిపించని బంద్ ప్రభావం
దిశ ప్రతినిధి,మేడ్చల్: నగరంలో బంద్ ప్రభావం కనిపించడంలేదు. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ప్రజా రవాణా వ్యవస్థ కొనసాగుతోంది. విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు తెరుచుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్ కెఎం) ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునివ్వగా, కాంగ్రెస్ సహా వామపక్షాలు, 19 పార్టీలు మద్దతు తెలిపాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్ ఉంటుందని ఆయా పార్టీలు ప్రకటించాయి. కానీ ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీనికి తోడు ఆర్టీసీ సిటీ బస్సులు, ఆటోలు ప్రజా రవాణా వాహనాలు యథావిధిగా నడుస్తున్నాయి.
స్కూళ్లు, కాలేజీలు మూత పడలేదు. మాల్స్, సినిమా హాళ్లు యథావిధిగా నడుస్తున్నాయి. కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ రైతులు చేపట్టిన దీక్షలు సోమవారం నాటికి సంవత్సరం కావడంతో బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు 50కి పైగా రైతు సంఘాలు మద్దతు తెలియజేస్తున్నాయి.