- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీమంత్రికి హైకోర్టులో ఊరట.. ఆయనను అరెస్టు చేయోద్దని ఆదేశం
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి అయ్యన్నపాత్రుడుకు హైకోర్టులో ఊరట లభించింది. అయ్యన్నపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆయనను అరెస్ట్ చేయకూడదంటూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తనపై నమోదైన కేసులపై అయ్యన్నపాత్రుడు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులపై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఒకే అంశంపై ఒకటి కంటే ఎక్కువ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని అయ్యన్నపాత్రుడు తరపు న్యాయవాది వీవీ సతీష్ వాదించారు. న్యాయవాది సతీష్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు అతనిపై చర్యలు తీసుకోకుండా తదుపరి విచారణ వరకు వేచి ఉండాలని హైకోర్టు ఆదేశించింది. ఇకపోతే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వర్థంతి సభలో అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై గుంటూరు జిల్లాలో పోలీసులు మూడు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story