- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెక్నాలజీ పుణ్యమాని.. తల్లైన 70 ఏళ్ల వృద్ధురాలు
దిశ, వెబ్‌డెస్క్ : తల్లి కావడం గొప్ప వరం అంటారు. వివాహం అయిన ప్రతీ మహిళా తల్లి కావాలనుకుంటుంది. అమ్మాని పిలిపించుకోవాలని ప్రతీ మహిళ ఆరాటపడుతుంటుంది. పొత్తిల్లలో తన బిడ్డను ఎత్తుకొని సంబర పడుతుంది. కానీ పెళ్లై కొన్న సంవత్సరాలు గడుస్తున్నా తల్లి కాకపోతే ఆ మహిళ పడే బాధ అంతా ఇంతాకాదు. ఏ శుభకార్యాలకు వెళ్దామన్నా గొడ్రాలు అంటూ నిందలు వేస్తుంటారు. పిల్లలకోసం ఎంతో ప్రయత్నిస్తారు.. ఆసుపత్రులకు వెళ్లడం, నాటు వైద్యం ఇలా ఎన్ని చేసినా పిల్లలు కాకపోతే ఆ దంపతులు పడే బాధ వర్ణనాతీతం. అలా 45 సంవత్సరాలు పిల్లలకోసం ప్రయత్నించి.. ఎందరో దేవుళ్లకు మొక్కి చివరికి వారికి డెబ్బైయో ఏటా పిల్లలు పుడితే ఎలా ఉంటుంది. ఎవరూ ఊహించరు కదా.. కానీ గుజురాత్‌లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.
గుజరాత్‌లోని మోరా గ్రామంలో జివెన్‌బెన్ రబరి (70) భర్త మల్దారి(75) అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి వివాహం జరిగి 45 ఏళ్లు అయ్యింది. అయినా ఈ దంపతులకు పిల్లలు పుట్టలేదు. పిల్లల కోసం ఆ తల్లి ఎన్నో కలలు కన్నది చివరికి వారి కలను టెక్నాలజీ నేరవేర్చింది. మాతృత్వపు మధురిమల కోసం అల్లాడిపోతున్న జివెన్‌బెన్ దంపతులకు డాక్టర్ నరేశ్ భానుశాలి అభయమిచ్చారు.70 ఏళ్ల వయస్సులో పిల్లలు కనడంలో తప్పులేదని డాక్టర్ వృద్ధ దంపతులకు ధైర్యంచెప్పారు. అలా.. 70 ఏళ్లు వయసులో ఐవీఎఫ్ ద్వారా తల్లి కావాలనే రబరి కోరికను నెరవేర్చారు.
ఎలా జరిగింది ?
70 ఏళ్ల వయసున్న రబరి గర్భాశయం కుచించుకోపోయింది. దీంతో డాక్టర్లు ఆమె గర్భసంచిని విస్తరించేలా చేసి ఆమె గర్భంలో పిండాన్ని ఉంచారు. అలా నిరంతరం శిశువు పరిస్థితి ఎలా ఉందో పరీక్షలు చేస్తూ పరిశీలించేవారు. కానీ డాక్టర్లే ఆశ్చర్యపడేలా రబరి గర్భంలో శిశువు ఎటువంటి సమస్యలు లేకుండా చక్కగా పెరిగింది. అలా నిరంతరం అబ్జర్వేషన్‌లో ఉంటూ.. శిశువు ఎదుగుదల..గుండె చప్పుడు ఇలా అన్నీ పరిశీలించేవారు. అలా ఎట్టకేలకు రబరికి నెలలు నిండిన తరువాత ప్రసవం చేశారు. తల్లీ బిడ్డలు పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్ నరేశ్ భానుశాలి వెల్లడించారు. అలా జివెన్ బెన్ కు ధైర్యం చెప్పి చివరకు ఆ దంపతుల కలను సాకారం చేశారు. కాగా..తాను చూసిన వాటిలో ఇదే అత్యంత అరుదైన ఘటన అని డాక్టర్ నరేశ్ తెలిపారు. ఇక వివాహమైన 45 ఏళ్ల తర్వాత 70 ఏళ్ల వయసులో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఫలితంగా ప్రపంచంలోనే అతి పెద్ద వయసులో తల్లి అయిన అతి కొద్దిమంది మహిళల జాబితాలో చోటు సంపాదించుకుంది రబరి.