17 ఏళ్ల బాలుడి ప్రేమాయణం.. ముగ్గురి బాలికలతో రాసలీలలు.. ఆపై కేసు పెట్టి..

by Anukaran |   ( Updated:2021-08-05 02:00:09.0  )
17 ఏళ్ల బాలుడి ప్రేమాయణం.. ముగ్గురి బాలికలతో రాసలీలలు.. ఆపై కేసు పెట్టి..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమ పేరుతో మోసపోతున్న అమ్మాయిల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. ఒకరితో ఆగకుండా ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణాలు నడిపిస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. కామ కోరికలతో రగులుతూ.. వావివరసలు, చిన్నాపెద్ద అనే విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఒక 17 ఏళ్ల కుర్రాడు ప్రేమ పేరుతో ముగ్గురు బాలికలను మోసం చేసిన ఘటన మహబూబాబాద్ లో బుధవారం వెలుగుచూసింది. ముగ్గురు బాలికలకు ఒకరికి తెలియకుండా ఒకరితో ప్రేమాయణం నడుపుతూ వారితో శారీరక సంబంధాన్నీ కొనసాగిస్తున్న కుర్రాడి గుట్టురట్టయింది.

వివరాలలోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలుడు పక్క గ్రామానికి చెందిన ఒక బాలిక(16) ను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. కొన్ని రోజులకు బాలిక కూడా ప్రేమను వ్యక్తపరిచేసరికి అతగాడి ఆగడాలకు అడ్డులేకపోయింది. ప్రేయసితో శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడు. ఇక ఇలా సాగుతున్న వీరి ప్రేమకథ అమ్మాయి వాళ్ళింట్లో తెలియడంతో.. ఆమె తల్లిదండ్రులు బాలుడిని పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చి, కొంత డబ్బు చెల్లించి తెగదెంపులు చేసుకున్నారు.

ఆ తర్వాత బాలుడు మరో బాలిక(14)కు ప్రేమ పేరుతో దగ్గరయ్యి.. ఆమెతో కూడా రాసలీలలు సాగించడం మొదలు పెట్టాడు. ఒక పక్క ఈ బాలికతో ప్రేమలో ఉండగానే మరో బాలిక(17)ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెకు కూడా దగ్గరయ్యాడు. ఇలా ఒకేసారి ఇద్దరితో ప్రేమ వ్యవహారం నడుపుతుండగా.. ఒకరోజు అతని ప్రవర్తనపై అనుమానమొచ్చిన మూడో బాలిక అతడి ఇంటికెళ్లి నిలదీయడంతో బాలుడు అఘాయిత్యాలు వెలుగుచూశాయి. ప్రేమ పేరుతో అమ్మాయిలను వంచిస్తున్న బాలుడిపై మూడో బాలిక, ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే.. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తాను ఎవ్వరిని మోసం చేయలేదని బాలుడు రివర్స్ లో కేసు పెట్టడం గమనార్హం. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story