మహేష్ మిస్.. విజయ్‌తో కన్‌ఫర్మ్

by Shyam |   ( Updated:2021-05-30 05:40:05.0  )
మహేష్ మిస్.. విజయ్‌తో కన్‌ఫర్మ్
X

దిశ, సినిమా: ఇళయ దళపతి విజయ్ 66వ చిత్రం అప్‌డేట్‌తో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ కన్‌ఫర్మ్ చేయగా తెలుగు, తమిళ్‌లో బైలింగువల్‌ మూవీగా తెరకెక్కబోతుందని తెలుస్తోంది. జూన్‌లో అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని, 2022లో మూవీ సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

కాగా ఈ అనౌన్స్‌మెంట్‌తో సోషల్ మీడియాలో #Thalapathy66 హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుండగా.. విజయ్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు టీ‌మ్‌కు అభిమానులు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. వంశీ పైడిపల్లి చివరగా మహేష్ బాబు ‘మహర్షి’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ప్రాజెక్ట్ కూడా మహేష్‌తోనే ఉంటుందనుకున్నా స్క్రిప్ట్ సెట్ కాకపోవడం వల్ల కుదరలేదు. ఫైనల్‌గా విజయ్‌తో సినిమా చేస్తుండటంతో టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే ఇది మహేష్ వద్దనుకున్న కథ లేక కొత్తదా అనే అంశంపై చర్చించుకుంటున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story

Most Viewed