- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిగుమతి సుంకం తగ్గించాలని కేంద్రానికి లేఖ రాసిన టెస్లా
దిశ, వెబ్‌డెస్క్: ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)పై దిగుమతి సుంకాలని ఎక్కువ మొత్తం తగించాలని కోరుతూ ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజ సంస్థ టెస్లా భారత మంత్రిత్వ శాఖలకు రాసినట్టు తెలుస్తోంది. దిగుమతి సుంకాలను తగ్గించడం వల్ల గిరాకీ భారీగా పెరుగుతుందని, దీనివల్ల ప్రభుత్వానికి కూడా అధికంగా ఆదాయం ఉంటుందని కంపెనీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదే సమయంలో స్థానిక ఉత్పత్తుల తయారీని పెంచే క్రమంలో కేంద్రం చాలా వరకు పరిశ్రమలకు చెందిన ఉత్పత్తులపై అధికంగా దిగుమతి సుంకాలను విధించింది. గతంలోనూ పలు లగ్జరీ కార్ల తయారీ కంపెనీలు దిగుమతి చేసుకుంటున్న కార్లపై పన్నులను తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరాయి. తాజాగా, భారత్‌లో ఈ ఏడాది నుంచే విక్రయాలను ప్రారంభించాలని టెస్లా నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో దిగుమతులపై సుంకాలను 40 శాతానికి తగ్గించడం అవసరమని కోరుతూ మంత్రిత్వ శాఖలతో పాటు ప్రముఖ థింక్ ట్యాంక్ నీతి ఆయోగ్‌కు లేఖ రాసినట్టు సమాచారం. 40 శాతానికి దిగుమతి సుంకం వల్ల ఎలక్ట్రిక్ కార్లు మరింత సరసమైనవిగా మారుతాయని లేఖలో పేర్కొన్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ లేఖకు సంబంధించి అధికారికంగా బహిర్గతం చేసేందుకు కంపెనీ నిరాకరించినట్టు తెలుస్తోంది. కాగా, టెస్లా కంపెనీ ఈ ఏడాది దేశీయంగా బెంగళూరులో స్థానిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. దీని గురించి మాట్లాడిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దేశీయంగా టెస్లా ప్రారంభించే ఉత్పత్తి వ్యయం, చైనాలో కంటే తక్కువగా ఉండే విధంగా ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఈ ప్రోత్సాహకాలు స్థానిక తయారీ వల్లఏ మాత్రమే అందించనున్నట్టు వెల్లడించారు.