VRO ఉపేందర్‌కు ట్రెసా ఆర్థిక సాయం

by Shyam |
Garike-Upender-Rao,-Teresa
X

దిశ, తెలంగాణ బ్యూరో: కిడ్నీల సమస్యతో గచ్చిబౌలిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీఆర్వోల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గరికే ఉపేందర్ రావును ట్రెసా నాయకులు సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు రెవెన్యూ అసోసియేషన్ తరపున లక్ష రూపాయల చెక్కును వైద్య ఖర్చుల నిమిత్తం అందించారు. ప్రభుత్వం నుంచి అతని చికిత్స నిమిత్తం కావాల్సిన వైద్య ఖర్చులను మంజూరు చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఉపేందర్, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ పరామర్శలో ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్, కార్యదర్శి బాణాల రాంరెడ్డి, మెదక్, నిజామాబాద్​జిల్లాల అధ్యక్షులు మనోహర్ చక్రవర్తి, రమణ్​రెడ్డిలు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed