- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పది పరీక్షల్లో ఆరు పేపర్లు.. 80 మార్కులే..!
దిశ, తెలంగాణ బ్యూరో: పదో తరగతి బోర్డు పరీక్షలను ఆరు పేపర్లతోనే పూర్తిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. గతంలో ఉన్న 11 పేపర్లను ఆరింటికి కుదిస్తూ పాఠశాల విద్యా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాంచంద్రన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ప్రశ్నాపత్రాల సంఖ్యను కూడా తగ్గిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. 2020-21 ఏడాదికి సంబంధించి మాత్రమే. ఆరు సబ్జెక్టులను కూడా 80 మార్కులకు మాత్రమే నిర్వహించనున్నారు. ఇంటర్నల్ మార్కుల్లో ఎలాంటి మార్పు లేదు. రెండు సబ్జెక్టులను కలిపి పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ బయోలజీ, ఫిజికల్ సైన్స్‌లకు వేర్వేరు ఆన్సర్ షీట్స్ అందిస్తారు. వాల్యూయేషన్ సమయంలో ఇబ్బందులు కలుగకుండా ఈ చర్యలు తీసుకుంటున్నారు.
అదనపు ప్రశ్నల సంఖ్యలో పెంపు..
ఆన్‌లైన్ పద్ధతిలో తరగతులతో విద్యార్థులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాఠ్యాంశాలు పూర్తిస్థాయిలో అర్థం చేసుకోలేకపోవడంతో పాటు సందేహాలను నివృత్తి చేసుకునేందుకు అవకాశం కలగలేదు. 30-40 శాతం మంది విద్యార్థులు వివిధ కారణాలతో ఆన్‌లైన్ క్లాసులకు హాజరు కాలేదు. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రశ్నాపత్రంలో అదనపు ప్రశ్నల సంఖ్యను కూడా పెంచుతున్నారు. దీంతో పాటు పరీక్ష సమయంలోనూ అరగంట అదనంగా పెంపుదల చేశారు. కంపోజిట్ కోర్సులు, ఒకేషనల్ కోర్సుల మార్కుల ప్యాటెర్న్‌ల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. పదో తరగతి ప్రశ్నాపత్రం ప్యాటెర్న్ ప్రకటించినప్పటికీ.. షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించలేదు. మే రెండో వారంలో పరీక్షలు నిర్వహిస్తారని భావిస్తున్నప్పటికీ అధికారికంగా షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంది.