ఉద్రిక్తత.. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ vs బీజేపీ

by Sridhar Babu |   ( Updated:2023-03-14 09:21:51.0  )
TRS vs BJP
X

దిశ, హుజురాబాద్: ఉప ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో హుజురాబాద్ నడిబొడ్డున సంచలన ఘటన చోటుచేసుకుంది. సాక్షాత్తు భారత రాజ్యంగా పితామహుడు అంబేద్కర్ విగ్రహం ఎదుటే టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకొని రచ్చ చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో బుధవారం రాత్రి నుండి ఈటల రాజేందర్ బావమరిది మధుసూధన్ రెడ్డి వాట్సప్‌ చాటింగ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈటల భార్య జమునారెడ్డి, ఆమె సోదరుడు మధుసూధన్ రెడ్డిలు వందమంది కార్యకర్తలతో కలిసి హుజురాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు.

అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న క్రమంలో కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తల గ్రూపు ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. అనంతరం పరిస్థితి అదుపుదాటి ఒకరినొకరు నెట్టుకోవడం నుంచి చెప్పులు విసురుకోవడం వరకూ వెళ్లింది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకొని, ఇరు పార్టీల నాయకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయినా.. వినకుండా రెండు పార్టీల నేతలు జమ్మికుంట, వరంగల్ రహదారిపై బైఠాయించారు. చివరకు చేసేందేంలేక టీఆర్‌ఎస్ నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Read more updates : వాట్సాప్‌లో చాటింగ్.. ఈటల బావమరిది శవయాత్ర

Advertisement

Next Story