- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
GHMC వద్ద ఉద్రిక్తత.. రెచ్చిపోయిన బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు
దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ రోజురోజుకు ముదురుతోంది. కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలని ఇప్పటివరకు పలు దఫాలుగా నిరసన వ్యక్తం చేసిన బీజేపీ కార్పొరేటర్లు మంగళవారం మరింత రెచ్చిపోయారు. ఈరోజు ఉదయం పదిన్నర గంటలకు టైం బోర్డ్ సమీపంలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న బీజేపీ కార్పొరేటర్లు.. వద్దురా నాయన కేసీఆర్ పాలన అంటూ నినాదాలు చేస్తూ మేయర్ చాంబర్ వద్ద ధర్నా నిర్వహించారు.
అనంతరం కమిషనర్ ఆఫీస్ వైపు పరుగులు తీస్తూ హల్ చల్ సృష్టించారు. బీజేపీ కార్పొరేటర్లు, కమలం పార్టీ కార్యకర్తలు హంగామా సృష్టించారు. ఈ క్రమంలో మేయర్ ఆఫీస్ వద్ద ఉన్న పలు భవనాల అద్దాలను ధ్వంసం చేశారు. పూల కుండీలను విసిరి పారేశారు. సమస్యలపై చర్చించని కౌన్సిల్ ఎందుకని.?, తాము కార్పొరేటర్లుగా గెలిచి ఏమి సాధించామని ప్రశ్నించారు. మేయర్ విజయలక్ష్మి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీ వద్ద బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన ఇంకా కొనసాగుతోంది. ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.