టెన్నిస్‌ స్టార్ రఫెల్ నదాల్ సంచలన నిర్ణయం..

by Shiva |   ( Updated:2021-03-11 09:15:47.0  )
టెన్నిస్‌ స్టార్ రఫెల్ నదాల్ సంచలన నిర్ణయం..
X

దిశ, స్పోర్ట్స్ : స్పెయిన్ బుల్ రఫెల్ నదాల్ టెన్నిస్‌కు కొన్నాళ్ల పాటు దూరంగా ఉండనున్నట్లు చెప్పాడు. 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత అయిన నదాల్.. గత కొన్ని రోజులుగా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. నొప్పి నుంచి పూర్తిగా కోలుకోకుండానే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడిన నదాల్.. సెమీస్‌లో స్టెఫానో సిట్సిపాస్ చేతిలో ఓడిపోయాడు. అప్పటి నుంచి ప్రాక్టీస్‌కు కూడా దూరంగా ఉంటున్నాడు. కాగా, వచ్చే వారం నుంచి దుబాయ్‌లో జరుగనున్న ఏటీపీ 500 టూర్ మ్యాచ్‌లలో ఆడటం లేదని నదాల్ గురువారం స్పష్టం చేశాడు. ఆ టోర్నీ ఆడటానికి తనకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించిందని.. కానీ ప్రస్తుతం తన శరీరం ఆటకు సహకరించడం లేదని నదాల్ పేర్కొన్నాడు. గాయం పూర్తిగా తగ్గితే ఈ నెల 24 నుంచి జరుగనున్న మియామీ ఓపెన్‌లో పాల్గొనే అవకాశం ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed