మిలియన్ మార్చ్" కు పదేళ్లు

by Anukaran |   ( Updated:2021-03-10 02:25:53.0  )
మిలియన్ మార్చ్ కు పదేళ్లు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ చాల కీలకం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యావత్ తెలంగాణ ప్రజలను కేసీఆర్ ఏకంచేశారు. తెలంగాణ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు 2011, మార్చి 10న హైదరాబాద్ లోని ట్యాంక్బండ్ లో మిలియన్ మార్చ్ చేపట్టారు.

మిలియన్ మార్చ్ అడ్డుకునేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించింది. హైదరాబాద్ నగరమంతా పారామిలిటరీ బలగాలను మోహరించడంతో పాటు జిల్లా సరిహద్దుల్లో బారికేడ్లు, ఇనుప కంచెలు ఏర్పాటు చేసింది. అయితే ముందస్తు వ్యూహంతో వ్యవహరించిన తెలంగాణవాదులు ఊహించిన దానికంటే ఎక్కువగానే ట్యాంక్ బండ్ కు చేరుకున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాలనే ఆశ్చర్యపరుస్తూ లక్ష్యలాది మంది ఆందోళనకారులు మిలియన్ మార్చ్ లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవతం చేశారు. నిర్బంధాలను చేదించి.. సాగరతీరంలో సమరశంకం పూరించిన యావత్ తెలంగాణ , సమైక్య పాలకుల అణిచివేతకు దీటుగా…దిక్కారంతో సమాధానం చెప్పారు తెలంగాణ బిడ్డలు.

తెలంగాణఉద్యమకారులకు సెల్యూట్..

తెలంగాణ మలిదశ ఉద్యమంలో భాగంగా చేపట్టిన మిలియన్ మార్చ్ కార్యక్రమానికి నేటితో పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమకారులకు సెల్యూట్ అని ట్వీట్ చేశారు.

Advertisement

Next Story