ఆస్ట్రేలియాకు ఉక్రెయిన్ రిక్వెస్ట్.. అవి పెంచాలంటూ డిమాండ్..

by Javid Pasha |
ఆస్ట్రేలియాకు ఉక్రెయిన్ రిక్వెస్ట్.. అవి పెంచాలంటూ డిమాండ్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. రష్యాతో పోరాడేందుకు కావలసిన ఆయుధ వాహనాలను తనకు అందించాలంటూ కోరారు. ఇటీవల ఆస్ట్రేలియా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెలెన్‌స్కీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రష్యాతో యుద్ధం చేసేందుకు సహాయం చేయాలని కోరారు. 'రష్యాతో చేసే యుద్ధంలో ఉక్రెయిన్‌కు ఎంతగానో ఉపయోగపడే సాయుధ వాహనాలు, బెష్‌మాస్టర్లు మీ వద్ద ఉన్నాయి. వాటిని ఉక్రెయిన్‌కు పంపితే రష్యాతో పోరాడతాం. వాటితో పాటు మరిన్ని ఆయుధ సామాగ్రిని కూడా ఉక్రెయిన్‌కు పంపితే యుద్ధంలో వినియోగించుకుంటాం' అని జెలెన్‌స్కీ అన్నారు. అంతేకాకుండా రష్యాపై విధించిన ఆంక్షలను మరింత పెంచాలని కోరారు.

Advertisement

Next Story