- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాగిన మైకంలో ఆవు పై యువకుడి అత్యాచారం..?
దిశ, లోకేశ్వరం: తాగిన మైకంలో యువకుడు ఆవు పై అత్యాచారం చేయగా, ఆవు మృతి చెందింది. సభ్య సమాజం తలదించుకునే ఈ సంఘటన లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, లోకేశ్వరం ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలు లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇంట్లో పనులు చేస్తున్నారు. అందులో ఓ యువకుడు బుధవారం రాత్రి మద్యం మత్తులో ఇంటి బయట కట్టేసి ఉంచిన ఆవును నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి తీసుకెళ్లి కిటికీకి బంధించి అత్యాచారం చేసినట్లు సమాచారం.
దీంతో తప్పించుకునేందుకు పెనుగులాడిన ఆవు మెడకు తాడు ఉరి పడి మరణించినట్లు తెలిపారు. గురువారం ఉదయం యజమాని ఆవు కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించగా నిర్మాణంలో ఉన్న ఇంట్లో ఆవు మృతి చెంది ఉండటం గమనించిన ఆ ఆవు యజమాని సాయన్న, ఆవు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ తూ.గో గ్రామస్తుల ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గురువారం ఉదయం లోకేశ్వరం ఎస్ఐ సాయి కుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం.
ఆవు రక్తనమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాం: పశువైద్యాధికారి, జెస్సి
పోలీసుల ద్వారా సమాచారం రాగానే సంఘటనా స్థలానికి వెళ్లి ఆవు రక్త నమూనాలను సేకరించాం. అలాగే పోస్టుమార్టం నిర్వహించి పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాము. నివేదికలు వచ్చిన తర్వాత ఆవు పై అత్యాచారం జరిగింది లేనిది తెలుస్తుంది.
నిందితున్ని అదుపులోకి తీసుకున్నాం: ఎస్ఐ సాయి కుమార్
పిప్రి గ్రామంలో ఆవు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సమాచారం రాగానే సంఘటనా స్థలానికి వెళ్లాం. ఆవు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామ్. పోస్ట్ మార్టం నివేదిక రాగానే తగు చర్యలు చేపడతామని ఎస్ఐ సాయి కుమార్ అన్నారు.