నిర్భయ ఘటన రిపీట్.. బస్సులో యువతిపై అత్యాచారం

by samatah |   ( Updated:2022-03-13 06:45:51.0  )
నిర్భయ ఘటన రిపీట్.. బస్సులో యువతిపై అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్ : మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకు మహిళలపై దాడులు అనేవి పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరీని వదలడం లేదు. ఒక ఆడపిల్ల ఇంటి నుంచి బయటకు వెళ్లిందంటే ఆమె మళ్లీ ఇంటికి వచ్చే వరకు ఆ తల్లిదండ్రులు పడే బాధ చెప్పలేనిది.. అంత ఘోరంగా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు.

ఏనిమిదేళ్ల కిందట జరిగిన నిర్భయ ఘటన తెలిసిందే. ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే అదే ఘటన మరోసారి మధ్యప్రదేశ్‌లో జరిగింది.




బస్సులో ప్రయాణం సురక్షితం అనుకొని బస్సు ఎక్కిన మహిళకి కండెక్టర్, డ్రైవర్ షాకిచ్చారు. ఎవరు లేని ప్రాతంలో బస్సు ఆపి యువతిపై కండెక్టర్, డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన మధ్య ప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో కలకలం సృష్టిస్తోంది.

మనవార్ పోలీస్ స్టేషన్ కథనం ప్రకారం.. శుక్రవారం మహిళ ప్రయాణిస్తున్న బస్సు కుక్షి నుండి మనవర్‌కు వెళ్తుండగా, ఆమె లాంగ్‌సారిలో దిగాల్సి ఉంది. యువతి ఎక్కిన కొద్ది సేపటికి డ్రైవర్, కండెక్టర్ ప్లాన్ వేసుకున్నారు. దీంతో టికెట్ తీసుకుని ఎక్కడి వరకు వెళ్లాలి అని అడుగగా, ఆమె లాంగ్సారిలో దిగాలి అని చెప్పింది. దీంతో వారు.. ముదు వేసుకున్న పథకం ప్రకారం మహిళను డ్రైవర్, కండక్టర్, క్లీనర్ లాంగ్‌సారిలో దింపలేదు. దీంతో మహిళ, అందులో ఉన్న ప్రయాణికులు బస్సు ఆపండి అని మొత్తుకున్నా వారు వినిపించనట్టుగా ఉన్నారు. చివరికి ఓ ప్రయాణికురాలు.. నిలదీయగా గంధవాణిలో దింపుతామని చెప్పారు. వారి మాటలు నమ్మిన మహిళ తర్వాత స్టేషన్ కోసం ఎదురు చూస్తూ బస్సులోనే కూర్చుండి పోయింది. చివరకు బస్సు ఖాళీగా ఉండటంతో కండక్టర్ బస్సును ఆపి గులాటి రోడ్డు, బాలిపూర్ రోడ్డు మధ్య ఏకాంత ప్రదేశంలో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత డ్రైవర్, క్లీనర్ కూడా ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేయగా, మూడో నిందితుడు పరారీలో ఉన్నాడు.కాగా, సామూహిక అత్యాచారం కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశాం.. ఇతర నిందితుల కోసం అన్వేషణ కొనసాగుతోంది" అని ధార్ ఎస్పీ ఆదిత్య ప్రతాప్ సింగ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed