- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్య తప్పుడు పనులు చేస్తూ దొరికినా భర్త ఏమనలేదు.. కారణమేమంటే ?
దిశ, వెబ్ డెస్క్: నదిలో భర్త మృతదేహం లభ్యమైంది. పోలీసులకు అనుమానమొచ్చి ఇంటిపక్కన ఉండే యువకుడిని విచారించారు. అయినా కూడా అతడు బుకాయించే ప్రయత్నం చేశాడు. కానీ, వాళ్ల స్టైల్ లో ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని చందర్ పూర్ కు చెందిన ఓ వ్యక్తికి వివాహమైంది. అయితే, అతడి భార్య పొరుగింటి యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఇంటి నుంచి వెళ్లగానే అతడితో గడిపేది. ఈ క్రమంలో అనుకోకుండా ఒకరోజు భర్త ఇంటికి రావడంతో వీరిద్దరూ దొరికిపోయారు. అయినా కూడా అతను సహనంతో వ్యవహరించాడు. మరోసారి ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దంటూ భార్యకు సూచించాడు. ఆ యువకిడికి కూడా తమ ఇంటికి రావొద్దని చెప్పాడు.
తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తపై ఆమె కక్ష పెంచుకుంది. ఓ రోజు రహస్యంగా ప్రియుడిని కలిసి తన భర్తను అంతమొందించాలని చెప్పింది. దీంతో ఆ యువకుడు ఆమె భర్తను హత్య చేసేందుకు అతని ఫ్రెండ్ తో కలిసి ప్లాన్ వేశాడు. అనుకున్న విధంగా ఆమె భర్తకు ఫోన్ చేశాడు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి హోటల్ లో మద్యం సేవించారు. ఆ తర్వాత అక్కడి నుంచి బైక్ పై బయలుదేరారు. అయితే, తెల్లావారు రోజున బ్రిడ్జి కింద నదిలో భర్త మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ స్టార్ట్ చేశారు. ఇంటిపక్కన యువకుడిని ప్రశ్నించారు. ఆమె భర్త బైక్ పై నుంచి నదిలో పడి మృతిచెందాడని.. ఆ సమయంలో తాను తెలివిగా తప్పించుకున్నట్లు అతడు చెప్పడంతో పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో వెంటనే అతడి ఫోన్ రికార్డ్స్ పరిశీలించారు. దీంతో అసలు విషయం బయటపడింది. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.