- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విద్యా సంస్థల మధ్యలో బ్రాందీ షాపులు
దిశ, జఫర్‌గడ్: జనగామ జిల్లా జఫర్‌గడ్ మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, ప్రసిద్ధ ప్రఖ్యాతిగాంచిన జఫర్‌గడ్ ఖిలా స్థలం మందుబాబులకు అడ్డాగా మారాయి. మండల కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మూడు బ్రాందీ షాపులను విద్యాసంస్థల మధ్య ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జఫర్‌గడ్ నుండి వర్ధన్నపేట వెళ్లే ప్రధాన రహదారి మూలమలుపున బ్రాందీ షాపులు ఏర్పాటు చేయడంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రజలు, ప్రజా ప్రతినిధులు మొర పెట్టుకున్నా బ్రాండ్ షాపు యజమానులు.. ఎవరు ఎట్లా సస్తే మాకేంటి అనే చందంగా వ్యవహరిస్తున్నారు. ఈ బ్రాందీ షాప్ లపై మహిళలు, ప్రజలు ప్రజా ప్రతినిధులకు, జిల్లా స్థాయి అధికారులకు సమాచారం ఇచ్చిన చూసి చూడనట్టుగా వ్యవహరించడంతో ముడుపులు ముట్టాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజలు, విద్యార్థినిలు ఆందోళన చేసే వరకు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఉలుకు పలుకు ఉండదా, ఎవరు ఎట్లా సస్తే మాకేంటి అన్న చందంగా వ్యవహరించడం సమంజసమేన అని ప్రశ్నిస్తున్నారు. ఈ బ్రాండి షాపులను తక్షణమే అక్కడి నుండి తరలించాలని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడినా ఇప్పటివరకు స్పందించకపోవడం హాస్యాస్పదంగా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి సిండికేట్ గా మారిన 3 బ్రాందీ షాప్ లను అక్కడినుండి తక్షణమే వేరే చోటికి మార్చాలని ప్రజలు, విద్యార్థినిలు, మహిళలు, ప్రజా సంఘాలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తావని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.