- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
WhatsApp సరికొత్త ఫీచర్.. ఇకపై ఆ టైం కూడా చూసిస్తోందట..
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువగా వినియోగించే మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ప్రతి ఒక్కరి ఫోన్‌లో ఈ యాప్ పక్కా ఉంటుంది. వినియోగ దారులకు మరింత దగ్గరయ్యేందుకు సంస్థ యాజమాన్యం కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంటుంది. అయితే తాజాగా వాట్సాప్ తన యూజర్స్ కోసం మరో కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. వినియోదారుడిని ఆకట్టుకుంటుంది. ఇకపై వాట్సాప్‌లో ఏదైనా డాక్యుమెంట్‌ను డైన్‌లోడ్ చేస్తున్నా, అప్‌లోడ్ చేస్తున్నా అందుకు పట్టే సమయాన్ని అంచనా వేసే విధంగా ఈ కొత్త ఫీచర్ ఉంటుందని వాబీటాఇన్ఫో(వాట్సాప్ బీటా ఇన్ఫో) తెలిపింది. 'ఇకపై డాక్యుమెంట్‌ను సెండ్ చేసే సయంలో కొత్త లేబుల్‌లో అందుకు పట్టే సమయాన్ని అంచనాగా చూపిస్తోంది. అదే విధంగా ఈ డాక్యుమెంట్ రిసీవ్ చేసుకునేవారికి కూడా చాట్ బాక్స్‌లోనే డాక్యుమెంట్ ఎంత సమయంలో వస్తుందో చూపిస్తోంది. ఈ ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఫోన్‌లకు బీటా వెర్షన్‌ను రిలీజ్ చేశాం. త్వరలోనే అందరికీ దీనిని అందుబాటులోకి తీసుకొస్తాం' అని వాట్సాప్ యాజమాన్యం తెలిపింది.