- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ నెల 21న ఢిల్లీలో ఏం జరగబోతోంది..? సీఎం కేసీఆర్ స్కెచ్ అదేనా..?
దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 21న తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం జరగనున్నది. యాసంగి వడ్లను పూర్తిగా కేంద్రమే కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో ఈ మీటింగ్ జరగనున్నది. ఇదే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు, ఆందోళనలపై ఈ సమావేశంలో చర్చించి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయనున్నారు. సమావేశం తర్వాత మంత్రులను ఢిల్లీకి తీసుకెళ్ళనున్నారు. ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఈ అంశంపై చర్చించనున్నారు. రాష్ట్రంతో పాటు పార్లమెంటు ఉభయ సభల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు నిరసనలు తెలియజేయనున్నారు. పంజాబ్ రాష్ట్రంలోని వడ్లను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కొంటున్నట్లుగానే తెలంగాణలోనూ ఎఫ్‌సీఐ సేకరించాలనే డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వనం ముందు ఉంచనున్నారు. తెలంగాణ రైతుల జీవన్మరణ సమస్యగా మారినందున పోరాటాలను, ఆందోళనలను ఉధృతం చేయాలని టీఆర్ఎస్ భావిస్తున్నది.