- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరు నెలల్లో కర్నె తండా లిఫ్ట్ పూర్తి చేస్తాం : మంత్రి నిరంజన్ రెడ్డి
దిశ,వనపర్తి : ఆరు మాసాలలో కర్నె తండా లిఫ్టు పనులు పూర్తిచేసి 4600 ఎకరాలు సాగునీరు అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఖిల్లా ఘనపురం మండలంలోని ఎత్తైన ప్రాంతాల గిరిజన తండాలోని భూములకు సాగు నీరు అందించే కర్నెతండా లిఫ్టు పనులను మంత్రి నిరంజన్ రెడ్డి స్వయంగా ఎక్సవేటర్ వాహనంతో మట్టి తీసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గిరిజనులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిరవేరుస్తూ ఇటీవల సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనలో కర్నె తండా లిఫ్ట్ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.
ఘనపురం బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణ జలాలను తరలించేందుకు కర్నె తండా లిఫ్టు పనులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. లిఫ్టుకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్, సివిల్ వర్క్ పనులను నీటిపారుదల శాఖ ఎస్ఈ, డీఈ, ఏఈలు ఆరు మాసాల్లో పూర్తి చేస్తామని దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ లక్ష్మారెడ్డి, ఎంపీపీ కృష్ణ నాయక్, నీటి పారుదల శాఖ డీఈ సత్యనారాయణ గౌడ్, టీఆర్ఎస్ మండలం అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య, జడ్పీటీసీ సమ్య నాయక్, గిరిజన నాయకులు, తండాప్రజలు పాల్గొన్నారు.