Warangal BJP : తెలంగాణకు మోడీ రాకకు ముందు బీజేపీకి మరో షాక్

by S Gopi |   ( Updated:2022-07-01 09:37:56.0  )
Warangal BJP Corporator Has been Joined In TRS in the presence Of KTR
X

దిశ, ఖిలా వరంగల్: Warangal BJP Corporator Has been Joined In TRS in the presence Of KTR| ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనకు ముందు బీజేపీ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. నిన్న హైదరాబాద్ లోని పలువురు బీజేపీ కార్పొరేటర్లు టీఆర్ఎస్ లో చేరగా శుక్రవారం ఐటీ మరియు పురపాలక మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో వరంగల్ కు చెందిన బీజేపీ 27వ డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనీల్, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు చింతాకుల సునీల్ టీఆర్ఎస్ లో చేరారు.

ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలు నచ్చక, తెలంగాణపై మోడీ చూపుతున్న వివక్షకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ నేతృత్వంలోనే తెలంగాణా అభివృద్ధి సాధ్యమని బీజేపీని వీడి టీఆర్ఎస్ చేరుతున్నట్టు వారు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బండా ప్రకాష్, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ టి. రమేష్ బాబు, టీఆర్ఎస్ నాయకుడు గందె నవీన్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story